Tuesday 10 April 2012

‘దరువు’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు


మాస్ మహరాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ‘దరువు’ ఆడియో విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 18న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. శివ(శౌర్యం ఫేం) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇటీవల మీడియాతో నిర్మాత మాట్లాడుతూ ''రవితేజ హావభావాలకు సరిపడే కథ ఇది. మాస్‌ని ఆకట్టుకొనే అంశాలున్నాయి. బ్యాంకాక్‌, రామోజీ ఫిల్మ్‌సిటీల్లో రెండు షెడ్యూళ్లు పూర్తిచేశాం.
ఏప్రిల్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, మే 4న సినిమాని విడుదల చేస్తాము''అన్నారు. 

ఇక ఈ చిత్రం కథ గురించి చెపుతూ..ఎవరితోనైనా గొడవకు దిగండి. కానీ మాస్‌తో పెట్టుకోకండి. వాళ్ల దగ్గర కాస్త పొగరు ఎక్కువ. ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా తీన్‌మార్‌ ఆడేస్తారు. ఆ కుర్రాడూ అంతే. నోటితో పోయేదాన్ని, చేతి దాకా తెచ్చుకొంటాడు. గొడవకు దిగడం అంటే మహా సరదా. ఇంతకీ అతగాడి కథేమిటో తెలియాలంటే 'దరువు' సినిమా చూడాల్సిందే అన్నారు. 

వరసగా గబ్బర్ సింగ్, రచ్చ సినిమా రైట్స్ తీసుకున్న దిల్ రాజు, తాజాగా రవితేజ, తాప్సీ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'దరువు'ని భారీ మొత్తం ఇచ్చి తీసుకున్నారు. గతంలో చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’ చిత్రం ఆధారంగా, ఒకరకంగా ఆ చిత్రానికి రీమేక్‌గా దరువు చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. అప్పుడు ఆ సినిమాలో యమ ధర్మరాజుగా కైకాల సత్యనారాయణ నటిస్తే..ఈ చిత్రంలో యంగ్ యమ ధర్మరాజుగా తమిళ నటుడు ప్రభు నటిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో సినిమా విడుదలైతేగానీ తెలియదు.

మాస్ మహారాజా రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ

No comments:

Post a Comment