Tuesday 10 April 2012

ఎన్టీఆర్ ‘బాద్‌షా’ రెగ్యులర్ షూటింగ్ డీటేల్స్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మే 15న ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చింది. 

ఫ్యామిలీ అండ్ హిల్లోరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ‘బాద్ షా’ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా’ చిత్రానికి పని చేస్తున్నారు.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ‘దమ్ము’ విడుదలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటించారు. కె.ఎస్.రామారావు సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

No comments:

Post a Comment